హుస్నాబాద్‌రూరల్: మహ్మదాపూర్ మాజీ సర్పంచ్ సంపత్‌కు జీపీ నుంచి రూ.5.08లక్షలు చెల్లించాల్సి ఉందని డీఎల్పీఓ వెంకటేశ్వర్లు తెలిపారు. బుధవారం ఎంపీడీఓ కార్యాయలంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ సర్పంచ్ సంపత్ గ్రామ అభివృద్ధి కోసం పనులు చేసినప్పటికీ జీపీడీపీ నమోదు చేయకుండా బిల్లులు చెల్లించడం కార్యదర్శులుగా ఇబ్బందిగా మారిందన్నారు. గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళికలో పొందుపర్చిన పనులను చేపడితే పంచాయతీ నిధుల నుంచి బిల్లులు చెల్లించడం జరుగుతుందన్నారు. గ్రామంలో అభివృద్ధి పనులు చేసినప్పటికీ జీపీడీపీ తీర్మానంలో నమోదు చేయకపోవడంతో బిల్లుల చెల్లింపు ఆలస్యమైందన్నారు. మొత్తం రూ.6.73లక్షలకు మే 19న రూ.1.65 లక్షలు మాజీ సర్పంచ్‌కు చెల్లించినట్లు వివరించారు. సమావేశంలో సూపరింటెండెంట్ శంకర్, మోహన్‌లు ఉన్నారు.


