పనుల్లో నాణ్యత తప్పనిసరి | - | Sakshi
Sakshi News home page

పనుల్లో నాణ్యత తప్పనిసరి

Jun 25 2026 7:28 AM | Updated on Jun 25 2026 7:28 AM

సిద్దిపేటరూరల్‌: హుస్నాబాద్‌ నియోజకవర్గంలో చేపడుతున్న అన్ని రకాల అభివృద్ధి పనులను నాణ్యతా ప్రమాణాలతో పూర్తి చేయాలని కలెక్టర్‌ హైమావతి అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లోని మీటింగ్‌ హాల్‌లో కోహెడ, అక్కన్నపేట మండలాల్లో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ పంచాయతీరాజ్‌ శాఖలో చేపడుతున్న ఉపాధి హామీ సీసీరోడ్డు, బీటీరోడ్డు, హెల్త్‌ సబ్‌సెంటర్‌, అంగన్వాడీ మరుగుదొడ్లు, ప్రైమరీ హెల్త్‌ సెంటర్‌ మరమ్మతులు వంటి పనులను కాంట్రాక్టర్లు నాణ్యతా ప్రమాణాలతో పూర్తి చేయాలన్నారు. 15వ ఆర్డిక సంఘం కింద చేపట్టిన ప్రాథమిక ఆరోగ్యకేంద్రాల మరమ్మతులు వేగంగా పూర్తి చేయాలన్నారు. హుస్నాబాద్‌ నుంచి కొత్తపల్లి ఫోర్‌లేన్‌ నిర్మాణం వేగం పెంచాలన్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వందశాతం పూర్తయ్యేలా చూడాలని సూచించారు. కార్యక్రమంలో ఆర్డీఓ రామ్మూర్తి, అన్ని మండలాల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

పాఠశాలకు రాని ఉపాధ్యాయులపై చర్యలు

జిల్లా కేంద్రంలో నిర్వహించిన ఒలింపిక్‌ రన్‌లో పాల్గొని మధ్యాహ్నం అయినా పాఠశాలకు రాని ఉపాధ్యాయులపై చర్యలు తీసుకోవాలని డీఈఓకు కలెక్టర్‌ కె. హైమావతి ఆదేశించారు. బుధవారం నారాయణరావుపేట మండల కేంద్రంలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలను కలెక్టర్‌ ఆకస్మికంగా సందర్శించారు. కామన్‌ డైట్‌ మెనూ తప్పనిసరిగా పాటించాలని ప్రధానోపాధ్యాయుడిని ఆదేశించారు. వ్యాయామ ఉపాధ్యాయుడు టి.సతీష్‌ ఒలింపిక్‌ రన్‌ ఉందని వెళ్లి మధ్యాహ్నం 2.30 దాటినా రాకపోవడంపై కలెక్టర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. అతనిపై చర్యలు తీసుకోవాలని డీఈఓను ఆదేశించారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని హెచ్చరించారు.

కలెక్టర్‌ హైమావతి

హుస్నాబాద్‌ నియోజకవర్గఅధికారులతో సమీక్ష

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement