సిద్దిపేటజోన్: క్రీడల ద్వారా ఆరోగ్య సమాజం నిర్మాణం జరుగుతుందని ఎంపీ రఘునందన్ రావు అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలో ఒలింపిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఒలింపిక్ డే రన్‌ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యువత క్రీడలను జీవన విధానంలో భాగంగా చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించడానికి ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలన్నారు. ఒలింపిక్ క్రీడల స్ఫూర్తితో స్నేహం, ప్రేమ, క్రమశిక్షణ, గౌరవం, ప్రతిభ, విలువలను అలవర్చుకోవాలన్నారు. కార్యక్రమంలో డీఈఓ శాస్త్రి, జిల్లా యువజన క్రీడల శాఖ అధికారి వీరారెడ్డి, అసోసియేషన్ చైర్మన్ మోహన్‌రెడ్డి, యువకులు పాల్గొన్నారు.
ఎంపీ రఘునందన్ రావు
జిల్లా కేంద్రంలో ఒలింపిక్ డే రన్


