● మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్
● వానాకాలం జాగ్రత్తలపై అధికారులకు దిశానిర్దేశం
● సిద్దిపేటలో చేర్యాల పాలకవర్గం పర్యటన
సిద్దిపేటజోన్: విధుల్లో నిర్లక్ష్యం, అలసత్వం వహిస్తే ఉపేక్షించేది లేదని సిద్దిపేట మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్ స్పష్టం చేశారు. బుధవారం మున్సిపల్ కార్యాలయంలో వర్షాకాలంలో తీసుకునే జాగ్రత్తలు గూర్చి శానిటరీ సిబ్బంది, అధికారులతో సమావేశం నిర్వహించారు. పట్టణాన్ని శుభ్రంగా ఉంచాలన్నారు. నీరు ప్రవహించే నాళాలను క్షేత్ర స్థాయిలో పరిశీలించి చర్యలు తీసుకోవాలని సూచించారు. సిద్దిపేట కోసం పనిచేయాలని సూచించారు. అంతకుముందు పట్టణంలో చేర్యాల మున్సిపాలిటీ పాలకవర్గం పర్యటించి వివరాలు సేకరించింది. కోమటి చెరువు, మురుగు నీటి శుద్ధీకరణ ప్లాంట్, ఇర్కోడ్ స్లాటర్ హౌస్, స్వచ్చ బడి, డంపు యార్డు, సేంద్రియ ఎరువుల తయారీ కేంద్రం పరిశీలించారు.


