మాజీ సర్పంచ్‌ది ప్రభుత్వ హత్యే | - | Sakshi
Sakshi News home page

మాజీ సర్పంచ్‌ది ప్రభుత్వ హత్యే

Jun 25 2026 7:28 AM | Updated on Jun 25 2026 7:28 AM

హుస్నాబాద్‌రూరల్‌: మండల పరిధిలోని మహ్మదాపూర్‌ మాజీ సర్పంచ్‌ పిట్టల సంపత్‌ది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యేనని సర్పంచ్‌ల సంఘం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు సుర్వి యాదయ్య ఆరోపించారు. బుధవారం మహ్మదాపూర్‌లో సంపత్‌ కుటుంబాన్ని ఓదార్చి పాడే మోసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా యాదయ్య మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం 31 నెలల నుంచి పెండింగ్‌ బిల్లులను చెల్లించడం లేదని ధ్వజమెత్తారు. మాజీ సర్పంచ్‌ల పై కక్షపూరితంగా వ్యవహరిస్తూ తీవ్ర మనోవేదనకు గురి చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. మాజీ సర్పంచ్‌ ఆత్మహత్యకు సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి సీతక్క బాధ్యత వహించాలన్నారు. బిల్లుల చెల్లింపులో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలన్నారు. వీరి వెంట గుంటి మధుసూధన్‌రెడ్డి, నెమలి సుభాష్‌గౌడ్‌, విద్యాసాగర్‌, నర్సింహులు, గద్దల రమేశ్‌, రాము, కుమార్‌, దినేష్‌రెడ్డి ఉన్నారు.

బిల్లులు చెల్లించకుంటేమంత్రుల ఇళ్లు ముట్టడిస్తాం

సర్పంచ్‌ల సంఘం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు యాదయ్య

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement