ఏఎంసీ చైర్మన్‌పై పీఎస్‌లో ఫిర్యాదు | - | Sakshi
Sakshi News home page

ఏఎంసీ చైర్మన్‌పై పీఎస్‌లో ఫిర్యాదు

Jun 25 2026 7:28 AM | Updated on Jun 25 2026 7:28 AM

నంగునూరు(సిద్దిపేట): మాజీమంత్రి హరీశ్‌రావును నంగునూరు ఏఎంసీ చైర్మన్‌ దేవులపల్లి యాదగిరి దూషిస్తూ సోషల్‌ మీడియాలో చేసిన పోస్ట్‌ నంగునూరులో కలకలం సృష్టించింది. బుధవారం బీఆర్‌ఎస్‌ నాయకులు నంగునూరుకు తరలి రాగా పెద్ద ఎత్తున పోలీసులను మోహరించడంతో ఉద్రిక్తత నెలకొంది. బీఆర్‌ఎస్‌ నాయకులు రాజగోపాల్‌పేట పోలీస్‌ స్టేషన్‌తో పాటు సిద్దిపేటలోని పోలీస్‌ కమిషనర్‌ కార్యాలయంలో యాదగిరిపై ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఉమ్మడి జిల్లా జెడ్పీ మాజీ వైస్‌ చైర్మన్‌, మాజీ ఎంపీపీ రాగుల సారయ్య విలేకరులతో మాట్లాడుతూ హరీశ్‌రావును వ్యక్తి గతంగా దూషిస్తూ అల్లర్లు సృష్టించేందుకు కుట్ర పన్నిన యాదగిరిపై పోలీసులు కఠిన చర్య తీసుకోవాలన్నారు. యాదగిరి బహిరంగ క్షమాపణ చెప్పకుంటే తరిమి కొడతామని హెచ్చరించారు. సమావేశంలో మాజీ ఎంపీపీ శ్రీకాంత్‌రెడ్డి, బీఆర్‌ఎస్‌ మండల పార్టీ అద్యక్షుడు లింగంగౌడ్‌, నాయకులు సోమిరెడ్డి, రమేశ్‌గౌడ్‌, మహిపాల్‌రెడ్డి, సర్పంచ్‌ బాలపోచయ్య, సాయిలు తదితరులు పాల్గొన్నారు.

హరీశ్‌రావును విమర్శిస్తే తరిమికొడతామని బీఆర్‌ఎస్‌ నేతల హెచ్చరిక

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement