ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): జిల్లా కేంద్రంలోని జెడ్పీహెచ్‌ఎస్ ఇందిరానగర్ పాఠశాల విద్యార్థిని అంజలిని విద్యాశాఖ కమిషనర్ అభినందించారు. తెలంగాణ మోడల్ యునైటెడ్ నేషన్స్ (టీఎంయూఎన్) సెషన్స్‌లో రాణించడంతో బుధవారం హైదరాబాద్‌లో విద్యాశాఖ కమిషనర్ నికోలస్ అభినందించినట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. ప్రతిభ, నాయకత్వ నైపుణ్యాలు, అంతర్జాతీయ అంశాలపై అవగాహన కృషిని అభినందిస్తు ప్రశంసా పత్రాలను అందించినట్లు తెలిపారు.
డీఐఈఓ తనిఖీ
బెజ్జంకి(సిద్దిపేట): స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలను డీఐఈఓ రవీందర్‌రెడ్డి బుధవారం తనిఖీ చేశారు. విద్యార్థుల అడ్మిషన్, హాజరు రిజిష్టర్‌లను పరిశీలించారు. విద్యార్థులను ప్రభుత్వ కళాశాలలో చేర్పించేలా గ్రామాల్లో అవగాహన కల్పించాలన్నారు. ప్రభుత్వ కళాశాలల్లో ప్రైవేటుకు దీటుగా విద్యను అందిస్తున్నామన్నారు. ప్రతి విద్యార్థి క్రమం తప్పకుండా హాజరుకావాలని సూచించారు.


