వర్గల్(గజ్వేల్): అక్షయ తృతీయ పర్వదినం వేళ ఆదివారం రాత్రి సుప్రసిద్ధమైన వర్గల్ శ్రీవిద్యాఽ దరి క్షేత్రాన్ని కలెక్టర్ హైమావతి సందర్శించారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపించారు. శ్రీచక్రపూజలో పాల్గొ న్నారు. ఈ సందర్భంగా వేదపండితులు మహ దాశీర్వచనం చేసి, తీర్థప్రసాదం, అమ్మవారి శేషవస్త్రం అందజేశారు.
ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): ప్రజా పాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహించనున్న వెల్ఫేర్ వీక్‌ను విజయవంతం చేయాలని వసతి గృహాల వార్డెన్లను కలెక్టర్ హైమావతి ఆదేశించారు.ఆదివారం రాత్రి జిల్లా కేంద్రంలోని వసతి గృహాలను ఆకస్మికంగా సందర్శించారు. వంటశాలలు, కిచెన్ రూమ్‌లను పరిశీలించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో కలెక్టర్ మాట్లాడుతూ సమయాన్ని వృధా చేయకుండా బాగా చదువుకోవాలన్నారు. సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని వాటిని పరిష్కరించే విధంగా కృషి చేస్తామని అన్నారు. బాలికల భద్రత అతి ముఖ్యమని కామన్ డైట్ మెనూ పాటించాలని రుచికరమైన భోజనం అందించాలని వార్డెన్లను ఆదేశించారు.
ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): రాష్ట్ర సారస్వత పరిషత్ బాలల కథల పోటీల్లో ‘అందరూ చేసిందే చేద్దాం’ కథ ఉత్తమంగా ఎంపికై నట్లు బాలసాహితీవేత్త ఉండ్రాళ్ల రాజేశం ఆదివారం తెలిపారు. మొత్తం 180 కథలలో పది కథలు ఎంపిక కాగా, అందులో సిద్దిపేటకు చెందిన అనిశెట్టి సతీశ్‌కుమార్ రాసిన కథ ఉత్తమ బహుమతికి ఎంపికైందన్నారు. ఈ మేరకు కవులు బస్వరాజ్‌కుమార్, కోణం పరశురాములు, వర్కోలు లక్ష్మయ్య, బి. సుధాకర్, చిరంజీవి, తిరుపతి, కాల్వ రాజయ్య తదితరులు అభినందనలు తెలిపారన్నారు.
హుస్నాబాద్‌రూరల్: హుస్నాబాద్ సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల కళాశాల విద్యార్థులు జిల్లా స్థాయి ర్యాంకులు సాధించినట్లు ప్రిన్సిపాల్ శ్యామలత ఆదివారం తెలిపారు. గురుకుల కళాశాలలో 2025–26 విద్యా సంవత్సరంలో టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనే జ్‌మెంట్ కోర్సును ప్రవేశ పెట్టారు. గ్రామీణ విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో కోర్స్‌ను ప్రారంభించారు. ఇందులో ప్రవేశాలు పొందిన విద్యార్థులు వందశాతం ఉత్తీర్ణత సాధించారు. ఇంటర్మీడియెట్ ప్రథమ సంవత్సరంలో రజాకర్ 453(500), మణికంఠ 452 (500) మార్కులతో జిల్లా టాపర్స్‌గా నిలిచారు. ఆసక్తి గల విద్యార్థులు టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్‌మెంట్ గ్రూపులో ప్రవేశం పొందాలని ప్రిన్సిపాల్ కోరారు. ఈ నెల 25 తేదీలోగా గురుకుల వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు.


