సిద్దిపేటఅర్బన్: చిన్నారులు, గర్భిణులు, బాలింతలు అంగన్‌వాడీ కేంద్రాల్లో అందించే పౌష్టికాహారాన్ని సద్వినియోగం చేసుకోవాలని డీడబ్ల్యూఓ శారద సూచించారు. శనివారం సిద్దిపేట అర్బన్ మండలంలోని పొన్నాలలో పోషణ్ పక్వాడ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆరేళ్ల లోపు పిల్లలను అంగన్‌వాడీ కేంద్రాలకు పంపిస్తే పౌష్టికాహారం అందుతుందన్నారు. చిన్నారులను ఫోన్‌కు అలవాటు చేయడంతో వారిలో మానసిక ఎదుగుదల లోపించి మాటలు సరిగా రాకపోవడం, ఇతర పిల్లలతో కలిసి మెలిసి ఉండకపోవడం, ఒంటరితనంకు అలవాటు పడుతారన్నారు. అలాగే గర్భిణులు, బాలింతలు మంచి పౌష్టికాహారం తీసుకోవాలన్నారు. అనంతరం పౌష్టికాహారానికి సంబంధించి పండ్లు, కూరగాయలు, పప్పు దినుసులు, మిల్లెట్స్ వంటి వాటిని ప్రదర్శిస్తూ గర్భిణులు, బాలింతలకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో పొన్నాల సర్పంచ్ అమ్ముల వెంకటయ్య, పోషణ్ అభియాన్ డీసీ వెంకటప్రసాద్, బీసీ శ్రీనివాస్, పంచాయతీ సెక్రటరీ నరేష్, ఐసీడీఎస్ సూపర్‌వైజర్ సునీత, అంగన్‌వాడీ టీచర్లు పాల్గొన్నారు.
డీడబ్ల్యూఓ శారద


