జోగిపేట(అందోల్): రాష్ట్ర ప్రభుత్వం వైద్య, విద్యారంగానికి అధిక ప్రాధాన్యతను ఇస్తుందని మంత్రి సి.దామోదర రాజనర్సింహ తెలిపారు. శనివారం చౌటకూర్, అందోలు మండలాల్లో పర్యటన సందర్భంగా పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలని, బాలికలు ఉన్నత విద్యనభ్యసించాలని ఆయన సూచించారు. గ్రంథాలయాన్ని డిజిటల్ లైబ్రరీగా మారుస్తామన్నారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం కలగకుండా ఉండేందుకు నూతనంగా సబ్‌స్టేషన్‌ను ఏర్పాటు చేశామన్నారు. గ్రామీణ ప్రాంతాల ప్రజలకు అన్ని శాఖల అధికారులు అందుబాటులో ఉండేలా సమీకృత భవానాన్ని నిర్మిస్తామన్నారు. ఆయన వెంట జిల్లా కలెక్టర్ ప్రావీణ్య, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంజయ్య, అదనపు కలెక్టర్ పాండు, మున్సిపల్ చైర్మన్ ఎస్.కృష్ణారెడ్డి, వైస్ చైర్మన్ ఆకుల చిట్టిబాబు, సంగమేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.
మంత్రి దామోదర రాజనర్సింహ


