చిన్నకోడూరు(సిద్దిపేట): ప్రభుత్వంతో పోరాడి పొద్దు తిరుగుడు, మొక్కజొన్న రైతులకు న్యాయం చేసేందుకు ప్రయత్నం చేస్తానని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. శనివారం రాత్రి మండల పరిధిలోని పెద్దకోడూరులో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులు పండించిన పొద్దు తిరుగుడు, మొక్కజొన్నలు కొనడం లేదని, దీంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు పూర్తిగా విస్మరించిందన్నారు. ప్రభుత్వం కొత్త రోడ్లు ఇవ్వకపోయినా, కనీసం బీఆర్ఎస్ ప్రభుత్వం మంజూరు చేసిన రోడ్లనైనా పూర్తి చేయాలని అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీశానన్నారు. గ్రామాభివృద్ధికి అన్నిరకాల సహాయ సహకారాలు అందిస్తానన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ సామల సునీత, నాయకులు మాణిక్యరెడ్డి, శ్రీనివాస్, పాపయ్య, కనకరాజు, ఆయా గ్రామాల సర్పంచ్‌లు పాల్గొన్నారు.
మాజీ మంత్రి హరీశ్‌రావు


