‘కుస్తీ’మే సవాల్‌ | - | Sakshi
Sakshi News home page

‘కుస్తీ’మే సవాల్‌

Apr 19 2026 1:44 PM | Updated on Apr 19 2026 1:44 PM

నారాయణఖేడ్‌: ఖేడ్‌ మండలంలోని ర్యాకల్‌ గ్రామంలోని ఎల్లమ్మ జాతర ఉత్సవాలను పురస్కరించుకుని శనివారం కుస్తీపోటీలు నిర్వహించారు. ఈ పోటీలు హోరాహోరీగా సాగాయి. ప్రాంతం నుంచే కాకుండా కర్ణాటక, మహరాష్ట్ర ప్రాంతాల నుంచి సైతం మల్లయోధులు తరలివచ్చారు. 500మంది వరకు మల్లయోధులు స్థాయిని బట్టి పోటీలు నిర్వహించి చివరి కుస్తీ విజేతకు రూ.5,100లు బహుమతిగా అందజేశారు.

క్రమశిక్షణ తప్పనిసరి

మెదక్‌జోన్‌: పోలీసులు క్రమశిక్షణ, సమయపాలన తప్పనిసరిగా పాటించాలని ఏఆర్‌ డీఎస్పీ రంగనాథ్‌ అన్నారు. శనివారం జిల్లా పోలీస్‌ కార్యాలయంలో నిర్వహించిన పరేడ్‌కు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. పోలీసులు శరీర దారుఢ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, ప్రతిరోజూ వ్యాయామం చేయాలన్నారు. విధుల్లో నిర్లక్ష్యం వహించొద్దని ఆదేశించారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొనే వారికి ఎలాంటి మినహాయింపులు ఉండవని హెచ్చరించారు. చెడు అలవాట్లకు దూరంగా ఉండి, ప్రజలకు సమర్థవంతమైన సేవలు అందించాలని సూచించారు.

Advertisement
 
Advertisement
Advertisement