ప్రజల వద్దకే పాలన | - | Sakshi
Sakshi News home page

ప్రజల వద్దకే పాలన

Apr 17 2026 11:14 AM | Updated on Apr 17 2026 11:14 AM

కలెక్టర్‌ హైమావతి

కొమురవెల్లి(సిద్దిపేట): ప్రజల వద్దకు పాలన తీసుకువచ్చేందుకే ప్రభుత్వం ‘ప్రజా పాలన– ప్రణాళికలు’ తీసుకువచ్చిందని కలెక్టర్‌ హైమావతి తెలిపారు. గురువారం ప్రజాపాలన ప్రణాళికలో భాగంగా మండల కేంద్రంలోని రైతు వేదికలో ఏర్పాటు చేసిన సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకుని రాణించాలన్నారు. 99 రోజుల ప్రణాళికలో భాగంగా ఒక్కొక్క వారం ఒక్కో అంశంపై ప్రణిళికలు చేస్తూ చర్యలు తీసుకుంటునట్లు తెలిపారు. ప్రజలు, ప్రజాప్రతినిధులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించాలని కోరారు. జూన్‌ 2 నుంచి కుటుంబ జీవిత బీమాను ప్రభుత్వం అమలు చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ దివ్య, ఎంపీడీఓ లక్ష్మప్ప, ఎంపీఓ శ్రీనివాస వర్మ, అధికారులు ,సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement