నిబంధనలు పాటిద్దాం. సురక్షితంగా పయనిద్దాం | - | Sakshi
Sakshi News home page

నిబంధనలు పాటిద్దాం. సురక్షితంగా పయనిద్దాం

Apr 16 2026 12:05 PM | Updated on Apr 16 2026 12:05 PM

రోడ్డు భద్రత.. అందరి బాధ్యత

సిద్దిపేట బస్టాండ్‌ చౌరస్తాలో ‘అరైవ్‌–అలైవ్‌’

సిద్దిపేటకమాన్‌: రోడ్డు భద్రత చట్టం మాత్రమే కాదని.. అది మన జీవితానికి రక్షణ కవచమని అదనపు డీసీపీ ఏఆర్‌ సుభాష్‌చంద్రబోస్‌, ఏసీపీ రవీందర్‌రెడ్డి, ట్రాఫిక్‌ ఏసీపీ సుమన్‌కుమార్‌ తెలిపారు. అరైవ్‌– అలైవ్‌ కార్యక్రమంలో భాగంగా సిద్దిపేట బస్టాండ్‌ చౌరస్తాలో పోలీసు అధికారులు ట్రాఫిక్‌, రోడ్డు నిబంధనలు, ప్రమాదాల నివారణపై బుధవారం అవగాహన కల్పించారు. రవాణశాఖ, పోలీసు అధికారులు ప్రైవేటు పాఠశాలల విద్యార్థులతో మానవహారం నిర్వహించి, ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వాహనదారులు వాహనాలు నడిపే సమయంలో బాధ్యతతో వ్యవహరించాలన్నారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్‌, కార్లు నడిపేసమయంలో సీట్‌ బెల్ట్‌ ధరించాలన్నారు. మైనర్‌ డ్రైవింగ్‌, ట్రిపుల్‌ రైడింగ్‌, డ్రంకెన్‌ డ్రైవ్‌, ర్యాష్‌ డ్రైవ్‌ చేయకూడదని అవగహన కల్పించారు. కార్యక్రమంలో సీఐలు వాసుదేవరావు, ఉపేందర్‌, లక్ష్మీబాబు, ప్రవీణ్‌కుమార్‌, రవాణశాఖ అధికారి శంకర్‌నారాయణ, ఎకై ్సజ్‌ సీఐ శ్రీనివాస్‌, పాఠశాలల ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement