ఎంపీ రఘునందన్‌రావు
గజ్వేల్‌రూరల్: బీజేపీతోనే దేశ అభివృద్ధి సాధ్యమవుతుందని ఎంపీ రఘునందన్‌రావు అన్నారు. బుధవారం గజ్వేల్‌లో భారతీయ జనతా పార్టీ పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ ప్రశిక్షణ తరగతులను నిర్వహించారు. ఈ సందర్భంగా రఘునందన్‌రావు మాట్లాడుతూ దేశ భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకొని ప్రధాని నరేంద్రమోదీ ముందు చూపుతో పాలన సాగిస్తుండగా, మాయమాటలతో ప్రజలను మభ్య పెట్టే విధంగా కాంగ్రెస్ వ్యవహరిస్తోందని విమర్శించారు. ప్రతి బీజేపీ కార్యకర్త బూత్ స్థాయి నుంచి కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలన్నారు. ఈ సందర్భంగా పలు అంశాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శులు ఓఎస్ రెడ్డి, ప్రకాశ్‌రెడ్డి, రాష్ట్ర కోశాధికారి వాసుదేవరావు, రాష్ట్ర అధికార ప్రతినిధులు, స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


