● సీపీ రష్మీ పెరుమాళ్
● పుల్లూరులో మన పోలీస్– మన ఊరు కార్యక్రమం
సిద్దిపేటరూరల్: విద్యార్ధులు ఎంచుకున్న లక్ష్యాన్ని సాధించేందుకు అంకిత భావం అవసరమని సీపీ రష్మీ పెరుమాళ్ అన్నారు. బుధవారం మండల పరిధిలోని పుల్లూరులో నిర్వహించిన మన పోలీస్–మన ఊరు కార్యక్రమాన్ని సీపీ సందర్శించారు. అలాగే పుల్లూరు బండ లక్ష్మీ నరసింహ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాలను, వైద్య శిబిరాన్ని, పాఠశాల సమీపంలో పునరుద్ధరించిన గ్రంథాలయాన్ని ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ యువత చదవడాన్ని అలవాటు చేసుకోవాలని పిలుపునిచ్చారు. విద్య గొప్ప ఆయుధమని, విద్యార్థులు చదువుపై దృష్టి సారించాలన్నారు. ఫోన్ వాడకం తగ్గించి, కష్టపడి చదవాలన్నారు. అరైవ్ అలైవ్ కార్యక్రమంలో భాగంగా వాహనదారుల భద్రత కోసం ఉచితంగా హెల్మెట్లను పంపిణీ చేశారు. కార్యక్రమంలో అదనపు డీసీపీ ఏఆర్ సుభాష్ చంద్రబోస్, స్థానిక ఏసీపీ రవీందర్, గ్రామస్తులు పాల్గొన్నారు.


