‘మల్లన్న’ నిర్వాసితుల్లో సంబురం | - | Sakshi
Sakshi News home page

‘మల్లన్న’ నిర్వాసితుల్లో సంబురం

Apr 16 2026 12:05 PM | Updated on Apr 16 2026 12:05 PM

ఎట్టకేలకు ఫలించిన న్యాయపోరాటం

రూ.12.54లక్షల చొప్పున ప్యాకేజీ

గజ్వేల్‌: గజ్వేల్‌– ప్రజ్ఞాపూర్‌ మున్సిపాలిటీ పరిధిలోని మల్లన్నసాగర్‌ నిర్వాసిత గ్రామాలకు చెందిన ఒంటరి మహిళల న్యాయపోరాటం ఫలించింది. ప్యాకేజీ కోసం 2019 నుంచి పోరాటం సాగించారు. వేములఘాట్‌ గ్రామానికి చెందిన 24 మంది, ఏటిగడ్డ కిష్టాపూర్‌ గ్రామానికి చెందిన 21 మంది ఒంటరి మహిళలకు ఒక్కొక్కరికి రూ.12.54లక్షల చొప్పున ప్యాకేజీని వారి ఖాతాల్లో జమచేసినట్లు బుధవారం తెలిపారు. ఏడేళ్ల తర్వాత తమ న్యాయ పోరాటం ఫలించడంతో నిర్వాసితులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కేసును హైకోర్టులో సమర్ధవంతంగా వాదించి గెలిపించిన హైకోర్టు న్యాయవాది సీహెచ్‌. రవికుమార్‌కు బాధితులు కృతజ్ఞతలు తెలిపారు. స్థానికంగా సంబురాలు చేసుకున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement