రాజ్యాంగం వల్లే తెలంగాణ | - | Sakshi
Sakshi News home page

రాజ్యాంగం వల్లే తెలంగాణ

Apr 15 2026 8:44 AM | Updated on Apr 15 2026 8:44 AM

కాళేశ్వరంపై తప్పుడు ప్రచారం

ఎమ్మెల్యే హరీశ్‌రావు

బంజేరుపల్లిలో అంబేడ్కర్‌ విగ్రహ ఆవిష్కరణ

సిద్దిపేటరూరల్‌: డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ రాసిన రాజ్యాంగంతోనే తెలంగాణ కల సాకారం అయిందని మాజీమంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. మంగళవారం నారాయణరావుపేట మండలం బంజేరుపల్లిలో నూతనంగా ఏర్పాటు చేసిన అంబేడ్కర్‌ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అంబేద్కర్‌ తనకోసం కాకుండా దేశం కోసం, అణగారిన వర్గాల కోసం ఆలోచించారన్నారు. ఆయన రచించిన రాజ్యాంగం వల్ల మన దేశం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా వర్ధిల్లుతోందన్నారు. ఎంతో దూరదృష్టితో అలోచింది కొత్త రాష్ట్ర ఏర్పాటుకు అసెంబ్లీ తీర్మానం అవసరం లేదని రాశారన్నారు. కేసీఆర్‌ ప్రపంచంలోనే అతిపెద్ద 125 అడుగుల అంబేడ్కర్‌ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తే, ఈ రేవంత్‌ సర్కార్‌ తాళం వేసిందన్నారు. నేటి యువత అంబేద్కర్‌ను స్పూర్తిగా తీసుకుని రాణించాలన్నారు. అంతకుముందు రాఘవాపూర్‌లో అంబేడ్కర్‌ విగ్రహానికి పూల మాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో గ్రామసర్పంచ్‌, మండల నాయకులు తదితరు లు పాల్గొన్నారు.

సిద్దిపేటరూరల్‌: చుక్కనీళ్ళు లేని ప్రాంతంలో మండుటెండల్లో సైతం చెరువుల, కుంటలు జలకళను సంతరించుకున్నాయని ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. మంగళవారం నారాయణరావుపేట మండల కేంద్రంలో ఎల్లమ్మతల్లి సిద్దోగం వేడుకల్లో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ ఎల్లమ్మ దేవాలయానికి దారి లేకపోతే బ్రిడ్జి నిర్మించామని, గౌడఫంక్షన్‌హాల్‌ నిర్మాణానికి రూ. 35లక్షలతో అభివృద్ధి చేశామన్నారు. గంగమ్మతల్లి గలగలా పారుతూ ఎల్లమ్మతల్లి పాదాలకు చేరిందన్నారు. కాళేశ్వరం కూలిందని తప్పుడు ప్రచారం చేసిన కుహనా నాయకులు నారాయణరావుపేట పెద్దచెరువు, కుంటలు చూడాలని హితవు పలికారు. ఎల్లమ్మగుడి నుంచి మల్యాలకు బీటిరోడ్డు మంజూరు అయిందని, టెండర్లు పూర్తి చేసి పనులు ప్రారంభించేలా చూస్తానన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement