● అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్
● ప్రజావాణిలో వచ్చిన అర్జీలు 235
సిద్దిపేటరూరల్: ప్రజావాణిలో భాగంగా ప్రజలు అందించిన అర్జీలను ఆలస్యం చేయకుండా పరిష్కరించాలని అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లోని మీటింగ్ హాల్‌లో నిర్వహించిన ప్రజావాణిలో ప్రజల నుంచి అర్జీలను అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్ స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమస్యలు పరిష్కారం అవుతాయనే నమ్మకంతో ప్రజలు ప్రజావాణికి వస్తారన్నారు. అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి అర్హతల మేరకు పరిష్కరించాలన్నారు. పలు రకాల సమస్యల పరిష్కారం కోరుతూ మొత్తంగా 235 దరఖాస్తులు వచ్చాయి. కార్యక్రమంలో డీఆర్‌ఓ నాగరాజమ్మ, హౌసింగ్ పీడీ, జిల్లా అధికారులు పాల్గొన్నారు.


