
పూర్తయిన భగీరథ పైప్‌లైన్ పనులు
గజ్వేల్: మల్లన్నసాగర్ నుంచి గజ్వేల్, దుబ్బాక నియోజకవర్గాలకు ప్రత్యేక మిషన్ భగీరథ పైప్‌లైన్ పనులు ఎట్టకేలకు పూర్తయ్యాయి. ‘సాక్షి’ వరుస కథనాల నేపథ్యంలో స్పందించిన సంబంధిత అధికార యంత్రాంగం పనులను పూర్తి చేయించింది. గురువారం ట్రయల్ రన్ నిర్వహించి నీటి సరఫరా ను ప్రారంభించారు. పైప్‌లైన్‌లు కొత్తవి కావడం వల్ల మంచినీటిని కొద్దిరోజుల వరకు కాచి వడపోసి వాడుకోవాలని మిషన్ భగీరథ ఎస్‌ఈ వెంకట్‌రెడ్డి తెలిపారు. పూర్త యిన పనులను పర్యవేక్షించిన ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈ విష యాన్ని తెలిపారు. పనులు పూర్తి కావడంతో ప్రజ్ఞాపూర్ వద్ద హెచ్‌ఎండబ్ల్యూఎస్(హైద్రాబాద్ మెట్రో వాటర్ వర్క్స్) మిషన్ భగీరథ ట్యాపింగ్ పాయింట్‌ను మూసేశారు. మంచినీటి సరఫరాకు సంబంధించి గజ్వేల్, దుబ్బాక నియోజకవర్గాలకు స్వయం ప్రతిపత్తి లభించినట్లయింది. సరిపడా నీటి సరఫరా జరగనుంది.