
పథకాల అమల్లో ఉద్యోగులే కీలకం
● డిమాండ్లు పరిష్కరించాలి ● టీఎన్జీఓ రాష్ట్ర అధ్యక్షుడు మార్గం జగదీశ్వర్
హుస్నాబాద్‌రూరల్: ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు చేర్చేది ఉద్యోగులేనని టీఎన్జీఓ రాష్ట్ర అధ్యక్షుడు మార్గం జగదీశ్వర్ అన్నారు. గురువారం హుస్నాబాద్ ప్రభుత్వ పాలిటెక్నిక్ అధ్యాపకుడు మధుసూదన్‌రెడ్డి పదవీ వీరమణ కార్యక్రమానికి హాజరై మాట్లాడారు. ఉద్యోగుల సమస్యలు పరిష్క రించాలని 56 డిమాండ్లను సీఎం దృష్టికి తీసుకెళ్తే 16 డిమాండ్లను పరిష్కరించడానికి ఆగస్టు 15 వరకు గడువు పెట్టారని చెప్పారు. ప్రభుత్వం సమస్యలను పరిష్కారించకపోతే ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో మరో కార్యాచరణను రూపొందిస్తామన్నారు. లెక్చరర్ల సర్వీసును 65 ఏళ్లకు పెంచడానికి సీఎం సానుకూలంగా స్పందించారని త్వరలోనే ఆచరణలోకి వస్తుందని చెప్పారు. ఉద్యోగులు సైతం చిత్తశుద్ధితో విధులు నిర్వర్తించాలన్నారు. కార్యక్రమంలో పుల్లయ్య, ప్రిన్సిపాల్ శ్రీదేవి, అభినవ్, సతీష్ తదితరులు పాల్గొన్నారు.