
జానపద కళలను పరిరక్షిద్దాం
కళాకారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రాంరెడ్డి
మిరుదొడ్డి(దుబ్బాక): నానాటికి కనుమరుగవుతున్న జానపద కళారంగాన్ని పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉందని జానపద వృత్తి కాళాకారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రాంరెడ్డి అన్నారు. వండర్ బుక్‌ఆఫ్ రిక్డార్డులో స్థానం దక్కించుకున్న మండల కేంద్రమైన మిరుదొడ్డిలోని సీతారామచంద్ర స్వామి అలయ భజన మండలి సభ్యులను ఆలయ కమిటీ చైర్మన్ తోట కమలాకర్‌రెడ్డి నేతృత్వంలో ఘనంగా సన్మానించి ప్రశంసా పత్రాలను అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల కరీంనగర్ జిల్లాలో ఆధ్యాత్మిక భజన మహోత్సవం నిర్వహించిన కార్యక్రమానికి వండర్ బుక్ ఆఫ్ రికార్డులో స్థానం దక్కిందన్నారు. అందులో మిరుదొడ్డికి చెందిన సీతారామాంజనేయ భజన మండలి కళాకారులు 30 మంది పాల్గొనడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో టెలికం బోర్డు మెంబర్ మొగుళ్ళ మల్లేశం, బీజేపీ జిల్లా నాయకుడు కాన్గంటి శ్రీనివాస్, బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు తోట అంజిరెడ్డి, నాయకులు సూకూరి లింగం, మొగుళ్ల ఐలయ్య, కాస కిష్టయ్య, భజన మండలి సభ్యులు తదితరులు పాల్గొన్నారు.