
ప్రతీ విద్యార్థి ఉన్నతంగా ఎదగాలి
బీజేపీ జిల్లా అధ్యక్షుడు బైరి శంకర్
ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): ప్రతీ విద్యార్థి చిన్ననాటి నుంచే ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని ఉత్తమ పౌరులుగా ఎదగాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు బైరి శంకర్ అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని శ్రీ సరస్వతి శిశు మందిర్‌లో నిర్వహించిన వందన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. నిరంతరం దేశం కోసం పనిచేస్తున్న ప్రధానమంత్రి మోదీని ఆదర్శంగా తీసుకోవాలన్నారు. దేశం అభివృద్ధిలో అందరం భాగస్వాములు కావాలన్నారు. ఈ సందర్భంగా పాఠశాల కమిటీ అధ్యక్షుడు పెద్ది వైకుంఠం, ప్రధానోపాధ్యాయులు నరేష్ కుమార్‌లు బైరి శంకర్‌ను ఘనంగా సన్మానించారు.
స్థానిక ఎన్నికల్లో సత్తాచాటుదాం
సిద్దిపేటరూరల్: త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు బైరి శంకర్ ముదిరాజ్ అన్నారు. గురువారం మండల పరిధిలోని పుల్లూరులో నిర్వహించిన మండల ఎన్నికల కార్యశాలకు శంకర్ హాజరై మాట్లాడారు. గెలుపునకు బీజేపీ కార్యకర్తలు కలిసి కట్టుగా కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో జిల్లా ఎన్నికల ప్రభారి కనకయ్య, మండల ఎన్నికల ప్రభారి రమేశ్‌గౌడ్, మండల అధ్యక్షుడు సురేశ్‌గౌడ్, నాయకులు నరేశ్, నవీన్ తదితరులు పాల్గొన్నారు.