బెల్ట్‌షాపులు తొలగించండి
అసెంబ్లీలో ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి
దుబ్బాక: పల్లెల్లో పచ్చని కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తున్న మద్యం బెల్ట్ షాపులను తొలగించాలని అసెంబ్లీలో ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి విన్నవించారు. గురువారం శాసనసభ ప్రశ్నోత్తరాల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తాను ఏ గ్రామానికి వెళ్లినా బెల్ట్ షాప్‌లను తొలగించాలంటూ మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయన్నారు. పల్లెల్లో విచ్చల విడిగా మద్యం అమ్మకాలు జరుగుతుండటంతో యువత పెడదారి పడుతోందన్నారు. రోడ్డు ప్రమాదాలు సైతం జరుగుతుండటంతో ప్రాణాలు కోల్పోతున్నారని అన్నారు. అలాగే ఆర్థికంగా బాధిత కుటుంబాలు చిన్నాభిన్నం అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలను కోటీశ్వరులను చేస్తామంటున్న ప్రభుత్వం.. ముందుగా బెల్ట్‌షాపులను తొలగించి అండగా నిలవాలన్నారు.
బ్రిడ్జిని పూర్తి చేయండి
దుబ్బాక నియోజకవర్గంలో కూడవెల్లి వాగుపై మిరుదొడ్డి మండలం అల్వాల వద్ద బ్రిడ్జి నిర్మాణం ఏళ్లుగా పిల్లర్ల దశలోనే నిలచిపోయిందని ప్రస్తావించారు. ఈ బ్రిడ్జి నిర్మాణం చేపడితే నాలుగైదు మండలాల ప్రజలకు సౌకర్యవంతంగా ఉంటుందన్నారు. వానాకాలంలో వరద వస్తే రాకపోకలు బంద్ అవుతాయని, దీంతో ఆయా గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ప్రభుత్వం దీనిపై దృష్టిసారించి చర్యలు తీసుకోవాలని కోరారు.
దరఖాస్తుల గడువు పెంపు
ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): స్కాలర్‌షిప్ దరఖాస్తుల గడువు పొడిగించారు. 2024– 25 విద్యా సంవత్సరానికి గాను పోస్ట్ మెట్రిక్ స్కాలర్‌షిప్ దరఖాస్తుల గడువును మే 31 వరకు పొడిగించినట్లు జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి హమీద్ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అర్హులైన విద్యార్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు.
జమిలి ఎన్నికలపై అవగాహన కల్పించండి
బీజేపీ జిల్లా అధ్యక్షుడు బైరి శంకర్
ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): ఒకే దేశం, ఒకే ఎన్నికతో ప్రజాస్వామ్య అభివృద్ధికి నాంది పలుకుతుందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు బైరి శంకర్ ముదిరాజ్ అన్నారు. గురువారం బీజేపీ జిల్లా కార్యాలయంలో ఒకే దేశం, ఒకే ఎన్నిక జిల్లా కన్వీనర్ నలగామ శ్రీనివాస్ అధ్యక్షతన వర్క్ షాప్ నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా బైరి శంకర్ పాల్గొని మాట్లాడారు. దేశ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని జమిలీ ఎన్నికలు నిర్వహించాలని, ప్రధాని మోదీ సారథ్యంలో పార్లమెంట్‌లో బిల్లును ప్రవేశపెట్టారన్నారు. జమిలి ఎన్నికల పై ప్రజలకు అవగాహన కల్పించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సిద్దిపేట జిల్లా కోకన్వీనర్ తోడుపునూరి వెంకటేశం, పార్లమెంట్ కో కన్వీనర్ చింత సంతోష్ కుమార్, పార్టీ సీనియర్ నాయకులు గుండ్ల జనార్దన్, మండల కన్వీనర్లు, కో కన్వీనర్లు పాల్గొన్నారు.
పేదల సేవలోనే సంతృప్తి
దుబ్బాకటౌన్: నిరుపేదలకు సేవ చేయడంలోనే నిజమైన సంతృప్తి ఉందని కలెక్టరేట్ ఏఓ అబ్దుల్ రెహమాన్ అన్నారు. రంజాన్ పురస్కరించుకుని గురువారం దుబ్బాక పట్టణంలో బిస్మిల్లా బైతుల్ మాల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 55 మంది పేద ముస్లిం మహిళలకు 20 రకాల నిత్యావసర సరుకులతో కూడిన తోఫా, చీరలు, రూ.500 నగదును పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మానవ సేవయే మాధవసేవగా భావించి పేదలకు సహాయ సహకారాలు అందించడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో సిద్దిపేట అర్బన్ తహసీల్దార్ సలీం మియా, ట్రస్ట్ అధ్యక్షుడు చాంద్‌మియా తదితరులు పాల్గొన్నారు.
బెల్ట్‌షాపులు తొలగించండి
బెల్ట్‌షాపులు తొలగించండి


