మిరుదొడ్డి(దుబ్బాక): ప్రకృతితో మరింత బంధాన్ని పెంచుకోవడానికి ప్రతి ఏటా విద్యార్థులు పర్యావరణ హితంగా వృక్షా బంధన్ నిర్వహించారు. అక్బర్‌పేట–భూంపల్లి మండల పరిధిలోని కూడవెల్లి ప్రాథమిక పాఠశాల విద్యార్థులు ప్రతి ఏటా రక్షా బంధన్ జరుపుకోవడమే కాకుండా పాఠశాల ఆవరణలోని మొక్కలకు, చెట్లకు తమ తల్లిదండ్రులతో కలిసి రాఖీలు కడుతున్నారు. మొక్కలు నాటి సంరక్షిస్తామని ప్రతిన బూనారు. అలాగే భూంపల్లి మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాల విద్యార్థులు సైతం ప్రకృతి ఒడిలో లభించే పువ్వులు, ఆకులతో తయారు చేసిన రాఖీలతో వేడుకలు జరుపుకొన్నారు.
రావి ఆకుపై అనురాగ బంధం
నారాయణఖేడ్: అన్నా, చెల్లెళ్ల అనుబంధానికి ప్రతీక అయిన రాఖీ పౌర్ణమిని పురస్కరించుకొని నారాయణఖేడ్ పట్టణానికి చెందిన ప్రముఖ చిత్రకారుడు, లీప్ ఆర్టిస్ట్ శివకుమార్ రావి ఆకుపై సోదరుడికి సోదరి రాఖీ కడుతున్న చిత్రాన్ని మలిచారు. ఈ చిత్రం చూపరులను ఎంతగానో ఆకట్టుకుంది.


