బిస్కెట్లతో రూపొందించిన రాఖీ..
అక్కకు అంకితమిచ్చిన తమ్ముడు
గజ్వేల్‌రూరల్: గజ్వేల్ పట్టణానికి చెందిన రామకోటి భక్త సమాజం వ్యవస్థాపకుడు రామకోటి రామరాజు బిస్కెట్లతో రూపొందించిన రాఖీని తన సోదరికి అంకితమిచ్చాడు. మూడేళ్ల క్రితం ఆయన అక్క సంధ్య అనారోగ్యంతో మృతి చెందింది. దీంతో తన సోదరి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ప్రతి ఏటా వివిధ రూపాల్లో రాఖీని తయారు చేసి అంకితమిస్తున్నాడు. వివిధ రకాల బిస్కెట్లతో 10 అడుగుల భారీ రాఖీని రూపొందించినట్లు రామరాజు తెలిపారు.


