స్టార్‌డమ్‌ కాదు... సరైన కథతోనే విజయం | - | Sakshi
Sakshi News home page

స్టార్‌డమ్‌ కాదు... సరైన కథతోనే విజయం

Aug 28 2026 7:15 AM | Updated on Aug 28 2026 7:15 AM

స్టార్‌డమ్‌ కాదు... సరైన కథతోనే విజయం

విజయ్‌ దేవరకొండ

టాలీవుడ్‌ స్టార్‌, జాతీయ అవార్డు గ్రహీత అల్లు అర్జున్‌ అరుదైన ఘనత సాధించారు. ప్రముఖ అంతర్జాతీయ మ్యాగజీన్‌ ఫోర్బ్స్‌ ఇండియా తాజాగా విడుదల చేసిన ‘షోస్టాపర్స్‌ 2026’ స్పెషల్‌ మ్యాగజీన్‌ కవర్‌ పేజీపై అల్లు అర్జున్‌ కనిపించడం హాట్‌ టాపిక్‌ అయింది. కవర్‌ పేజీపై కనిపించడం మాత్రమే కాదు... ‘షోస్టాపర్స్‌ 2026’ టాప్‌ 100 జాబితాలోనూ అల్లు అర్జున్‌కి స్థానం లభించింది. ఈ జాబితాలో మరో తెలుగు హీరో రామ్‌చరణ్‌కు కూడా స్థానం లభించింది. ఈ లిస్ట్‌లో పేరు సంపాదించుకున్న తెలుగు హీరోలు ఈ ఇద్దరే కావడం విశేషం. 2025 జనవరి నుంచి 2026 మార్చి 31 వరకు వివిధ రంగాల్లో (సినిమా, ఓటీటీ, పుస్తకాలు, కళలు, ఫ్యాషన్‌ వంటివి) ప్రభావం చూపిన అత్యంత ప్రభావంతమైన టాప్‌ 100 సెలబ్రిటీల జాబితాను ‘షోస్టాపర్స్‌ 2026: ఇండియాస్‌ హండ్రెడ్‌ బిగ్గెస్ట్‌ సెలబ్రిటీస్‌’ పేరిట ఫోర్బ్స్‌ ఇండియా రిలీజ్‌ చేసింది. అమితాబ్‌ బచ్చన్‌, రజనీకాంత్‌, మోహన్‌ లాల్‌, ఆమిర్‌ ఖాన్‌, అక్షయ్‌ కుమార్‌, ఏఆర్‌ రెహమాన్‌, మాధవన్‌, రణ్‌వీర్‌ సింగ్‌, రిషబ్‌ శెట్టి, కంగనా రనౌత్‌, కల్యాణీ ప్రియదర్శన్‌ వంటి సినీ ప్రముఖులకు ఈ జాబితాలో స్థానం లభించింది. ఈ జాబితాకు ఎటువంటి ర్యాంకింగ్‌ ఆర్డర్‌ లేదు. ప్రముఖుల పేర్లలోని ఆల్ఫాబెటికల్‌ ఆర్డర్‌లో జాబితాను విడుదల చేశారు. ఇక ఫోర్బ్స్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ‘‘సినిమాలో మంచి కంటెంట్‌ ఉంటే భాషతో సంబంధం లేకుండా ఆ సినిమా విజయం సాధిస్తుంది. ప్రేక్షకులకు కొత్త కథ అందించడమే అన్నింటికంటే ముఖ్యం. అలాగే ఒక సినిమాలోని నటీనటీనటుల స్టార్‌డమ్‌ కంటే కూడా ఆ చిత్రంలోని సరైన కథే ఆ సినిమా విజయాన్ని నిర్ణయిస్తుంది’’ అని అల్లు అర్జున్‌ పేర్కొన్నారు. ప్రస్తుతం ‘రాకా’ సినిమాతో అల్లు అర్జున్‌ బిజీగా ఉన్నారు. అట్లీ దర్శకత్వంలో కళానిధి మారన్‌ నిర్మిస్తున్న ఈ చిత్రం 2027లో విడుదల కానుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement