మార్కెటింగ్ చీఫ్ మేనేజర్ నాగేశ్వరరావు
మేసీ్త్రలకు ప్రమాద బీమా పత్రాల పంపిణీ
సంగారెడ్డి: వికాట్ గ్రూపునకు చెందిన భారతి సిమెంట్స్ ప్రపంచ సిమెంట్ వ్యాపార రంగంలో తిరుగులేని సంస్థగా ఎదుగుతోందని ఆ సంస్థ మార్కెటింగ్ చీఫ్ మేనేజర్ వట్టి నాగేశ్వరరావు పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా 12 దేశాల్లో వికాట్ గ్రూప్ కంపెనీలు విస్తరించాయన్నారు. మంగళవారం సంగారెడ్డిలో భవన నిర్మాణ కార్మికులు (మేసీ్త్ర)లకు ప్రమాద బీమా పత్రాలను ఉచితంగా అందజేశారు. ఈ సందర్భంగా నాగేశ్వరరావు మాట్లాడుతూ.. ఇతర సిమెంట్లతో పోల్చితే భారతి అల్టాఫ్రాస్ట్‌తో చేపట్టిన నిర్మాణం వేగంగా పూర్తవుతుందన్నారు. టెక్నికల్ ఆఫీసర్ శ్రీధర్ మాట్లాడుతూ అల్టాఫ్రాస్ట్ వినియోగదారులకు తమ సంస్థ ఉచితంగా సాంకేతిక సహాయాన్ని అందిస్తుందని చెప్పారు. స్లాబ్ కాంక్రీట్ వేస్తున్న సమయంలో నిపుణులైన భారతి సిమెంట్ ఇంజనీర్లు సైట్ వద్దకే వచ్చి పనులను పర్యవేక్షించి తగిన జాగ్రత్తలు తెలియజేస్తారని తెలిపారు. ఇంటి నిర్మాణంలో క్రాక్స్ రాకుండా తీసుకోవాలిసిన జాగ్రత్తల గురించి మేసీ్త్రలకు వివరించారు. సమావేశంలో మార్కెటింగ్ విభాగం డిప్యూటీ మేనేజర్ గంగాధర్ రెడ్డి, డీలర్లు మోహన్‌రెడ్డి, నర్సింగ్‌రావు, వికాస్, మేసీ్త్రలు పాల్గొన్నారు.


