అదనపు భూ సేకరణ వద్దు | - | Sakshi
Sakshi News home page

అదనపు భూ సేకరణ వద్దు

Aug 26 2026 7:19 AM | Updated on Aug 26 2026 7:19 AM

న్యాల్‌కల్‌(జహీరాబాద్‌): నిమ్జ్‌ ప్రాజెక్టు కోసం సేకరించనున్న అదనపు భూసేకరణను వెంటనే నిలిపివేయాలని మండల పరిధిలోని హద్నూర్‌ గ్రామ రైతులు టీజీఐఐసీ ఎగ్జిక్యూటీవ్‌ డైరెక్టర్‌ వీరారెడ్డిని కోరారు. మాజీ మంత్రి హరీశ్‌రావు సుచనల మేరకు జహీరాబాద్‌ ఎమ్మెల్యే మాణిక్‌రావు అధ్వర్యంలో డీసీఎంఎస్‌ మాజీ చైర్మెన్‌ శివకుమార్‌తో కలిసి హైదరాబాద్‌ వెళ్లి వినతిపత్రం సమర్పించారు. గ్రామంలో నిమ్జ్‌ ఏర్పాటు కోసం ఇదివరకు 543 ఎకరాలను సేకరించారని, తాజాగా మరో 943 ఎకరాలను సేకరించేందుకు అధికారులు నిర్ణయించారని, దీనిని వెంటనే విరమించుకోవాలని కోరారు. మూడు పంటలు పండే భూములను పరిశ్రమల ఏర్పాటుకు తీసుకుంటే తమ బతుకులు ఆగమైపోతాయని ఆవేదన వ్యక్తం చేశారు. నిమ్జ్‌ బాధిత రైతుల సమస్యలను ఎమ్మెల్యే మాణిక్‌రావు డైరెక్టర్‌కు వివరించి న్యాయం చేయాలని కో రారు. 943 ఎకరాలకు సంబంధించి రైతులు విన్నవించిన సమస్యను ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లి పరిష్కా రం అయ్యేలా చూస్తానని ఆయన హామీ ఇచ్చారు. సర్పంచ్‌ ప్రవీణ్‌కుమార్‌ తదితరులు టీజీఐఐసీ డైరెక్టర్‌ను కలిసిన వారిలో ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement