ఈగల్ ఫోర్స్ ఎస్పీ రఘువీర్
సంగారెడ్డి జోన్: మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ప్రత్యేక దృష్టి సారించి, నిర్మూలనకు పటిష్ట చర్యలు చేపట్టాలని ఈగల్ ఫోర్స్ ఎస్పీ రఘువీర్ అధికారులకు సూచించారు. జిల్లాలో వివిధ పోలీసు స్టేషన్లలో నమోదైన ఎన్‌డీపీఎస్ కేసుల దర్యాప్తులో పురోగతి, మాదక ద్రవ్యాల నిర్మూలనకు తీసుకుంటున్న చర్యలు, సాంకేతిక పరిజ్ఞానం వినియోగంపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. విద్యాసంస్థల్లో యాంటీ డ్రగ్ కమిటీలు ఏర్పాటు చేసి, విద్యార్థులకు డ్రగ్స్ దుష్ప్రభావాలపై అవగాహన కల్పించాల న్నారు. జిల్లాలో డ్రగ్ డిస్పోజల్ కమిటీ ఆధ్వర్యంలో 1485 కిలోల గంజాయి, 5 కేజీల ఆల్ప్రాజోలం డిస్పోజల్ ప్రక్రియను పూర్తి చేసినందుకు పోలీసు అధికారులను అభినందించారు. కార్యక్రమంలో ఎస్పీ పరితోష్ పంకజ్, అదనపు ఎస్పీ చైతన్య రెడ్డి, ఈగల్ ఫోర్స్ డీఎస్పీ పుష్పన్‌కుమార్, ఇన్‌స్పెక్టర్ రామ్ నాయక్, డీఎస్పీలు సత్యయ్య గౌడ్, సైదానాయక్, వెంకట్ రెడ్డి, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.


