తథాస్తు అంటూ ఉండండి! | - | Sakshi
Sakshi News home page

తథాస్తు అంటూ ఉండండి!

Aug 25 2026 12:10 PM | Updated on Aug 25 2026 12:10 PM

‘అసలు ఈ నీచ మానవులు మిమ్మల్ని ఎలా చూస్తారో తెలుసా? చీర్‌ గాళ్స్‌గా చూస్తారే !’ అంటూ నటుడు ‘వెన్నెల’ కిశోర్‌ చెప్పే డైలాగ్‌తో ‘రంభ ఊర్వశి మేనక’ ట్రైలర్‌ ఆరంభం అయింది. ‘అల్లరి’ నరేష్‌ హీరోగా నటించిన చిత్రం ‘రంభ ఊర్వశి మేనక’. చంద్రమోహన్‌ చింతాడ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సురభి హీరోయిన్‌గా నటించారు. నరేష్‌ వీకే, ‘వెన్నెల’ కిషోర్‌, శ్రీనివాస్‌ రెడ్డి, మురళీధర్‌ గౌడ్‌, రాశీ సింగ్‌, విష్ణుప్రియ, ప్రిషా సింగ్‌, రచ్చ రవి ఇతర పాత్రలు పోషించారు. అన్నపూర్ణ స్టూడియోస్‌–హాస్య మూవీస్‌ బ్యానర్స్‌పై రాజేష్‌ దండా, నిమ్మకాయల ప్రసాద్‌ నిర్మించిన ‘రంభ ఊర్వశి మేనక’ మూవీ సెప్టెంబరు 4న విడుదల కానుంది. ఈ సినిమా ట్రైలర్‌ని హీరో అక్కినేని నాగార్జున లాంచ్‌ చేసి, చిత్రయూనిట్‌కి అభినందనలు తెలిపారు. ‘ముందు నేను ఈ లిస్ట్‌ చదువుతుంటాను మీరు తథాస్తు తథాస్తు అంటూ ఉండండి’, ‘అంటే మీకు ఇప్పుడు పవర్స్‌ లేవా?’, ‘నాకు నెలరోజులు కాదు.. జస్ట్‌ ఫైవ్‌ డేస్‌ ఇవ్వు చాలు’ అంటూ ‘అల్లరి’ నరేష్‌ చెప్పే డైలాగులు ట్రైలర్‌లో నవ్వులు పంచుతున్నాయి. అదేవిధంగా ‘యమధర్మ రాజులవారికి ప్రణామములు’, ‘మానవా.. ఇది మా తప్పిదం కాదు’(రాశీ సింగ్‌, విష్ణుప్రియ, ప్రిషా సింగ్‌), ‘ఈ అమ్మాయిలు ఏంటి? అసలు ఏం చేస్తున్నావురా నీవు’(సురభి), ‘మీరు మా ఇంద్రలోకం ప్రాపర్టీ.. ఇంత బోల్డ్‌ అండ్‌ బ్యూటిఫుల్‌గా ఉన్న మిమ్మల్ని భూలోకంలో బాయ్స్‌ వదులుతారా? అసలే వారు కరువుప్రాంత జీవులే’(‘వెన్నెల’ కిశోర్‌) అంటూ పలికే పలు డైలాగ్స్‌ ట్రైలర్‌లో ఉన్నాయి. ఈ చిత్రానికి సంగీతం: చైతన్‌ భరద్వాజ్‌, కెమెరా: రాంరెడ్డి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement