మంత్రి దామోదర రాజనర్సింహ
మెదక్ కలెక్టరేట్: జిల్లాలో వైద్య, ఆరోగ్య సేవలను బలోపేతం చేసేందుకు కృషి చేస్తానని మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. సోమవారం మెదక్‌లో ప్రారంభానికి సిద్ధంగా ఉన్న క్రిటికల్ కేర్ బ్లాక్‌ను స్థానిక ఎమ్మెల్యే రోహిత్‌రావుతో కలిసి మంత్రి ఆకస్మికంగా పరిశీలించారు. ఈ సందర్భంగా క్రిటికల్ కేర్ బ్లాక్‌ను త్వరలో ప్రారంభించేందుకు అవసరమైన ఏర్పాట్లపై ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి సూపరింటెండెంట్ సునీత దేవి, మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ నితిన్ కబ్రా, డీఎంహెచ్‌ఓ జ్ఞానేశ్వర్, డాక్టర్ శివ దయాళ్, వైద్య ఆరోగ్యశాఖ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షలో పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, మాజీ ఎమ్మెల్యే హనుమంతరావు పాల్గొన్నారు. క్రిటికల్ కేర్ బ్లాక్‌కు అవసరమైన హెచ్‌ఆర్ ఎక్విప్‌మెంట్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ఐహెచ్‌ఎఫ్‌ఎంఎస్ సేవలను అందుబాటులోకి తేవడంపై ఈనెల 25న హైదరాబాద్ సచివాలయంలో ఉన్నత స్థాయి సమావేశం ఉంటుందని మంత్రి తెలిపారు. వైద్యశాఖ అధికారులంతా హాజరు కావాలని ఆదేశించారు. తూప్రాన్‌లో ట్రామాకేర్ సెంటర్‌ను ఏర్పాటు చేస్తామన్నారు.


