దుబ్బాకటౌన్: జిల్లాలో ప్రధాన దేవాలయమైన దుబ్బాకలోని బాలాజీ దేవాలయం ప్రీ వెడ్డింగ్ షూట్‌కు ప్రధాన వేదికై ంది. కోడి కూత కూయకముందే షూటింగ్ షురూ అవుతోంది. వధువు, వరుడు సంప్రదాయ దుస్తులు ధరించి ఫొటోలు దిగి సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేస్తున్నారు. దీంతో ఆలయం ప్రీ వెడ్డింగ్ షూట్‌కు ప్రత్యేకంగా నిలుస్తోంది. ఆలయ పరిసరాల్లో పెద్ద పెద్ద చెట్లు, గోశాల ఉండటంతో వివిధ జిల్లాల నుంచి పెళ్లి కుదిరిన వధువు, వరుడు ప్రీ వెడ్డింగ్ షూట్‌కు బాలాజీ ఆలయాన్ని ఎంచుకుంటుండటం విశేషం. ఇవే కాకుండా పలు సీరియల్స్, వెబ్‌సిరీస్‌ల కోసం ఇక్కడ చిత్రీకరణ జరుగుతుంటాయి.


