చిన్నశంకరంపేట(మెదక్): మండల పరిధిలోని ధరిపల్లి.. షూటింగ్‌ల స్పాట్‌గా నిలుస్తోంది. పల్లె వాతావరణం.. పెద్దపెద్ద ఇళ్లు.. గ్రామానికి మనికట్టుగా ఉన్న రచ్చబండ.. సినిమా చిత్రీకరణకు అనువుగా మారింది. ప్రముఖ నటుడు రాణా, సాయిపల్లవి నటించిన విరాట పర్వం చిత్రీకరణ ఇక్కడే జరిగింది. అలాగే తాజాగా బలగం వేణు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘మైసమ్మ’ షూటింగ్ కూడా ఇక్కడే జరగడం విశేషం. ‘మెన్షన్ హౌస్ మల్లేశం’, దండోర, భగవంతుడు, ఏడుతరాల యుద్ధం, జూనియర్స్ లాంటి చిత్రాల షూటింగ్‌కు వేదికై ంది ధరిపల్లి.


