● డీఎస్పీ ప్రసన్నకుమార్
మెదక్‌జోన్: నిరంతర శ్రమతో క్రీడల్లో రాణించి జిల్లాకు పేరు ప్రతిష్టలు తీసుక రావాలని మెదక్ డీఎస్పీ ప్రసన్నకుమార్ కోరారు. 12వ, రాష్ట్ర జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్ అండర్ 14, 16, 18, 20 బాల, బాలికలకు స్థానిక స్టేడియంలో శుక్రవారం జ్రిల్లా స్థాయి పోటీలు నిర్వహించారు. ఇందులో 450 మంది క్రీడాకారులు పోటీపడ్డారు. త్రోబాల్, రన్నింగ్, జంపింగ్ విభాగాల్లో ఎంపికలు జరిగాయి. ప్రతిభ కనబర్చిన క్రీడాకారులు ఈ నెల 26, 27 తేదీల్లో వరంగల్‌లో జరిగే రాష్ట్ర స్థాయి క్రీడల్లో పాల్గొంటారని అథ్లెటిక్స్ కార్యదర్శి మధు సూదన్ తెలిపారు. కార్యక్రమంలో అథ్లెటిక్స్ అధ్యక్షులు వెంకటరమణ, అధికారులు తదితరులు పాల్గొన్నారు.


