నేడు ‘ఉద్యమ శిల్పి’ పుస్తకావిష్కరణ | - | Sakshi
Sakshi News home page

నేడు ‘ఉద్యమ శిల్పి’ పుస్తకావిష్కరణ

Aug 22 2026 7:13 AM | Updated on Aug 22 2026 7:13 AM

నేడు ‘ఉద్యమ శిల్పి’ పుస్తకావిష్కరణ ప్రమాదకర డ్రైవింగ్‌, రైడింగ్‌ స్టంట్లు చేస్తే చర్యలు నక్క దాడిలో ఇద్దరు మహిళలకు గాయాలు జిల్లాస్థాయి చెస్‌ పోటీల్లో విద్యార్థుల ప్రతిభ

నాంపల్లి: తెలంగాణకు చెందిన ప్రముఖ శిల్పి ఎం.వి.రమణారెడ్డి జీవిత ప్రస్థానం, కళా ప్రయాణం, తెలంగాణ ఉద్యమంలో ఆయన పోషించిన పాత్రను ప్రతిబింబించే ‘ఉద్యమ శిల్పి’ జీవిత చరిత్ర పుస్తకావిష్కరణ సభ శనివారం జరగనుంది. సిద్దిపేటలోని విపంచి కళా నిలయంలో మధ్యాహ్నం నిర్వహించనున్నట్లు నిర్వాహకులు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పుస్తకాన్ని ప్రముఖ రచయిత పున్న కృష్ణమూర్తి రచించారు. హైదరాబాదులోని తెలంగాణ అమరవీరుల స్మారక చిహ్నం, అమరజ్యోతి, తెలంగాణ తల్లి విగ్రహ రూప శిల్పిగా ఎం.వి.రమణారెడ్డి సేవలు విశేషమైనవి. ఈ పుస్తకావిష్కరణ సభకు బార్‌ అసోసియేషన్‌ మాజీ అధ్యక్షులు చింతలపల్లి జనార్దన్‌ రెడ్డి అధ్యక్షత వహిస్తారు. ముఖ్య అతిథిగా రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు, సీఎంఓ ప్రజావాణి ఇన్‌ఛార్జి జి.చిన్నారెడ్డి హాజరై పుస్తకాన్ని ఆవిష్కరిస్తారు.

గజ్వేల్‌రూరల్‌: రోడ్లపై ప్రమాదకరమైన డ్రైవింగ్‌, రైడింగ్‌ స్టంట్లు చేస్తే చర్యలు తప్పవని గజ్వేల్‌ సీఐ రవికుమార్‌, ట్రాఫిక్‌ సీఐ సత్యనారాయణలు అన్నారు. గజ్వేల్‌–ప్రజ్ఞాపూర్‌ మున్సిపాలిటీతో పాటు జాతీయ రహదారిపై ట్రాఫిక్‌కు అంతరాయం కలిగిస్తూ సైకిల్‌తో రోడ్లపై స్టంట్లు చేస్తూ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారిన వ్యక్తిపై ఫిర్యాదు అందినట్లు తెలిపారు. ఈ సందర్భంగా శుక్రవారం వారు మాట్లాడుతూ తమకు అందిన ఫిర్యాదు మేరకు సంబంధిత సైకిల్‌ రైడర్‌తో పాటు అతని తల్లిదండ్రులను స్టేషన్‌కు పిలిపించి కౌన్సిలింగ్‌ ఇచ్చామన్నారు. అందరూ రోడ్డు భద్రతా నియమాలను తప్పనిసరిగా పాటించాలన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లల ప్రవర్తనపై తగిన శ్రద్ద వహించాలన్నారు.

గ్రామస్తుల దాడిలో నక్క మృతి

బెజ్జంకి(సిద్దిపేట): ఇద్దరి మహిళా రైతులపై నక్క దాడిచేసిన ఘటన మండలంలోని గూడెం గ్రామంలో చోటుచేసుకుంది. గురువారం మహిళా రైతు హన్మండ్ల రామవ్వ పొలంలో పని ముగించుకుని వస్తుండగా ఆమైపె ఓ నక్క దాడి చేసింది. తీవ్రంగా గాయపడిన ఆమెను చికిత్స నిమిత్తం సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం తన పంటచేనులో పనిచేస్తున్న మాడ సరవ్వపై కూడా నక్క దాడిచేసింది. ఆమెను కాపాడేందుకు స్థానికులు చేసిన దాడిలో నక్క కూడా మృతి చెందింది. సరవ్వను కరీంనగర్‌ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు ఆమెకు చికిత్స అందిస్తున్నారు.

జహీరాబాద్‌: జిల్లా స్థాయి చెస్‌ పోటీల్లో జహీరాబాద్‌కు చెందిన విద్యార్థులు అద్భుతమైన ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. శుక్రవారం పట్టణంలోని సంఘమిత్ర పాఠశాలలో మెదక్‌ జిల్లా చెస్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో అండర్‌–17 విభాగంలో ఈ పోటీలు నిర్వహించారు. ఈ టోర్నీకి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సుమారు 120 మంది విద్యార్థులు ఉత్సాహంగా హాజరై తమ నైపుణ్యాలను ప్రదర్శించారు. ఈ పోటీల్లో భాగంగా పట్టణంలోని ఆదర్శ చెస్‌ అకాడమీకి చెందిన శ్రీనిధితో పాటు పలువురు విద్యార్థులు ఎంపికయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement