విద్యార్థులను అభినందించిన ఎమ్మెల్యే హరీశ్‌రావు
గజ్వేల్‌రూరల్: కరాటేలో విద్యార్థులు గిన్నీస్ వరల్డ్ రికార్డ్‌లో స్థానం సాధించడం గజ్వేల్ పట్టణానికే గర్వకారణమని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు పేర్కొన్నారు. ఏప్రిల్ 26న హైదరాబాద్‌లోని గచ్చి బౌలి స్టేడియంలో విజన్ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన కరాటే పోటీల్లో గజ్వేల్ పట్టణానికి చెందిన 21 మంది విద్యార్థులు పాల్గొని అరుదైన గుర్తింపు పొందడంపై కరాటే మాస్టర్ కృష్ణతో పాటు విద్యార్థులను అభినందించారు. ఈ సందర్భంగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో నమోదు కావడంపై వచ్చిన ప్రశంసా పత్రాలు, మెడల్స్‌ను బుధవారం సిద్దిపేటలో హరీశ్‌రావు విద్యార్థులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు మున్ముందు మరిన్ని విజయాలను సాధించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో గజ్వేల్ కౌన్సిలర్ శ్రీనివాస్, నాయకులు కల్యాన్‌కర్ నర్సింగరావు పాల్గొన్నారు.


