ఉద్యాన విశ్వవిద్యాలయ వీసీ రాజిరెడ్డి
ములుగు(గజ్వేల్): వాతావరణ మార్పుల వల్ల ఎదురవుతున్న ముప్పులను తగ్గించడంతో పాటు పర్యావరణ సమతుల్యతను కాపాడేందుకు వ్యవసాయ అటవీ విధానం శాసీ్త్రయ, ఆచరణాత్మక పరిష్కారమని కొండా లక్ష్మణ్ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం వీసీ డా. రాజిరెడ్డి అన్నారు. ములుగులోని అటవీ కళాశాల పరిశోధన సంస్థలో రెండు రోజులుగా నిర్వహించిన ‘క్‌లైమేట్ రెడీ ఆగ్రోఫారెస్ట్రీ’ఇంటి గ్రేటింగ్ ఎకాలజీ, టెక్నాలజీ ఇనిస్టిట్యూషనల్ ఇన్నోవేషన్ జాతీయ సదస్సు ముగింపు కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. పెరుగుతున్న వాతావరణ మార్పుల ప్రభావాలను ఎదుర్కొనేందుకు వ్యవసాయ అటవీ విధానాలను విస్తృతంగా అమలు చేయాల్సిన అవసరముందన్నారు. వివిధ సాంకేతిక విభాగాల్లో అత్యుత్తమ ఓరల్, పోస్టర్ ప్రదర్శనలు చేసిన పరిశోధకులకు అవార్డులు, సర్టిఫికెట్లు అందజేశారు. కార్యక్రమంలో ఐసీఎఫ్‌ఆర్‌ఈ–ఐఎఫ్‌బి డైరెక్టర్ స్వప్నేందు పట్నాయక్, రిజిస్టర్ భగవాన్, కళాశాల డీన్ ప్రవీణ, అధికారులు జ్యోతి ప్రకాశ్ మొహంతి, ప్రియరాజేంద్ర, శ్రీధర్ పాల్గొన్నారు.


