కరాటే కోచింగ్‌ సెంటర్‌లో మంటలు | - | Sakshi
Sakshi News home page

కరాటే కోచింగ్‌ సెంటర్‌లో మంటలు

Aug 19 2026 9:04 AM | Updated on Aug 19 2026 9:04 AM

నర్సాపూర్‌: నర్సాపూర్‌లోని కరాటే కోచింగ్‌ సెంటరులో మంగళవారం తెల్లవారు జామున మంటలు చెలరేగాయి. భవనం యజమాని రమేశ్‌ కథనం ప్రకారం.. కరాటే కోచింగ్‌ సెంటరు కోసం తన భవనంలోని సెల్లార్‌ను అద్దెకు ఇచ్చానని, ఇటీవల వారు ఖాళీ చేసినా కొంత సామగ్రి అందులోనే ఉందని చెప్పారు. కాగా మంగళవారం సెల్లార్‌ నుంచి పొగలు రావడంతో చుట్టుపక్కల వారు గమనించి ఫైర్‌ స్టేషన్‌కు సమాచారం ఇచ్చారు. అగ్నిమాపక అధికారులు వచ్చి మంటలను అదుపు చేశారు. కాగా షార్ట్‌ సర్క్యూట్‌తోనే మంటలు చెలరేగినట్లు రమేశ్‌ చెప్పారు. మ్యాట్స్‌ ఇతర సామగ్రి కాలిపోయాయి.

గుర్తుతెలియని బైక్‌ పార్కింగ్‌

శివ్వంపేట(నర్సాపూర్‌): మండల కేంద్రమైన శివ్వంపేటలో గుర్తు తెలి యని వ్యక్తికి సంబంధించి బైక్‌ పదిహేను రోజుల నుంచి ఒకేచోట పార్కింగ్‌ చేసి ఉంది. తూప్రాన్‌– నర్సాపూర్‌ హైవేకి ఆనుకొని గోదాం రైస్‌మిల్‌కు వెళ్లే దారిలో స్ప్లెండర్‌ ఏపీ 29 ఎన్‌ 6619 నంబర్‌ గల బైక్‌ పదిహేను రోజుల నుంచి ఇక్కడే నిలిపి ఉంది. ఎక్కడి నుంచైనా బైక్‌ను చోరీ చేసి తీసుకొచ్చి ఇక్కడ వదిలేశారేమోనని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు పరిశీలించి అనుమానిత బైక్‌కి సంబంధించి వివరాలు తేల్చాల్సిన అవసరం ఉంది. పరిశీలించి చర్యలు తీసుకుంటామని ఎస్‌ఐ మధుకర్‌రెడ్డి అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement