పాపన్నపేట(మెదక్): రాష్ట్రంలో ధూప, దీప నైవేద్య అర్చకులకు ఉద్యోగ భద్రత కల్పించాలని అర్చక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వాసుదేవ శర్మ విజ్ఞప్తి చేశారు. మంగళవారం ఆయన వనదుర్గా భవానీ ఆవరణలో నిర్వహించిన సంఘం జిల్లా కార్యవర్గ సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో మరిన్ని ఆలయాలను ధూప దీప నైవేద్య పధకంకింద ఎంపిక చేయాలన్నారు. అర్చకులకు పేస్కేల్ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
తొగుట(దుబ్బాక): మార్కెట్‌లో డిమాండ్ ఉన్న పంటలు సాగుచేసి ఆర్థికంగా ఎదగాలని జిల్లా ఇన్‌చార్జి వ్యవసాయాధికారి మల్లయ్య రైతులకు సూచించారు. మండలంలోని బండారుపల్లిలో ప్రత్యామ్నాయంగా సాగుచేసిన కంది, అలసంద పంటలను మంగళవారం పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ తమ ప్రాంతంలో వాతావరణ పరిస్థితులు, నీటి లభ్యత, నేల స్వభావం పరిగణలోకి తీసుకుని తక్కువ నీటితో సాగుచేయగల ప్రత్యామ్నాయ పంటలను ఎంపికచేసుకోవాలన్నారు.


