పదాధికారుల సన్మానంలో
బీజేపీ జిల్లా అధ్యక్షురాలు గోదావరి
జహీరాబాద్ టౌన్: నూతనంగా నియమితులైన పార్టీ పదాధికారులను బీజేపీ జిల్లా అధ్యక్షురాలు గోదావరి సన్మానించారు. జహీరాబాద్‌కు సోమవారం వచ్చిన సందర్భంగా ఆమె వారిని అభినందించి శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా గోదావరి మాట్లాడుతూ...నూతన పదాధికారులు పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ, క్షేత్రస్థాయిలో బీజేపీ బలోపేతానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. మహిళలు, ఓబీసీల సమస్యల పరిష్కారానికి నిరంతరం అందుబాటులో ఉండాలని సూచించారు. కార్యక్రమంలో పార్టీ పట్టణ అధ్యక్షుడు పూల సంతోశ్, రమేశ్‌రెడ్డి, నాయకులు అరుణ కౌలాస్, అక్షయ్ దేశ్‌పాండే, మహేశ్ తదితరులు పాల్గొన్నారు.


