తూప్రాన్: విద్యుత్ షాక్‌తో యువకుడు మృతి చెందాడు. ఈ ఘటన మండలంలోని నాగులపల్లి సమీపంలోని హల్దీవాగులో సోమవారం చోటు చేసుకుంది. ఎస్‌ఐ గంగరాజు వివరాల ప్రకారం.. ఒడిశా రాష్ట్రానికి చెందిన మురుము చైతన్(30) హల్దీవాగులో విద్యుదాఘాతంతో మృతి చెంది ఉన్నాడు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహంను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇంకా మృతికి గల కారణాలు తెలియలేదు. పోలీసులు కేసు నమోదు చేశారు.
గుండెపోటుతో సాక్షి ఏజెంట్..
శివ్వంపేట(నర్సాపూర్): మండ ల పరిధిలోని గోమారం గ్రామ సాక్షి దినపత్రిక ఏజెంట్ బాషా గౌడ్(60) గుండెపోటుతో మృతిచెందాడు. ఆదివారం రాత్రి ఇంట్లో ఉండగా గుండెపోటు రావడంతో గుర్తించిన కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ సోమవారం తెల్లవారుజామున మృతిచెందాడు.


