‘సురక్షా కా తిరంగా’ రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రథమ బహుమతి
పటాన్‌చెరు టౌన్: సైబర్ నేరాలపై అవగాహన కల్పించడంలో గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం విద్యార్థులు ప్రతిభ చాటారు. తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (టీజీసీఎస్‌బీ) నిర్వహించిన రాష్ట్రస్థాయి షార్ట్ వీడియో, రీల్ పోటీల్లో గీతం హైదరాబాద్ క్యాంపస్‌కు చెందిన విద్యార్థులు ప్రథమ బహుమతి సాధించారు. ‘సురక్షా కా తిరంగా–అప్రమత్తంగా ఉండండి.. క్షుణ్ణంగా తెలుసుకోండి.. సైబర్‌తో సురక్షితంగా ఉండండి’ పేరుతో బంజారాహిల్స్‌లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ (ఐసీసీసీ)లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. కాగా ఈ కార్యక్రమానికి ప్రముఖ సినీ నటుడు అక్కినేని నాగార్జున, రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్, టీజీసీఎస్‌బీ డైరెక్టర్ శిఖాగోయల్, హైదరాబాద్ పోలీసు కమిషనర్ వీసీ సజ్జనార్‌తో పాటు పలువురు హాజరయ్యారు. విజేతగా నిలిచిన గీతం స్కార్ క్లబ్ విద్యార్థులకు ప్రశంసాపత్రాలు, పురస్కారం అందజేశారు. విద్యార్థుల సృజనాత్మకత, చురుకై న భాగస్వామ్యాన్ని గీతం యాజమాన్యం అభినందించింది.


