సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ డా. సృజన
రామచంద్రాపురం(పటాన్‌చెరు): వన్‌వార్డ్ ఎవరీ డే కార్యక్రమంలో భాగంగా సోమవారం సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(సీఎంసీ) కమిషనర్ డా.సృజన తెల్లాపూర్ డివిజన్‌లో పర్యటించారు. డివిజన్ పరిఽధిలోని ముప్పా ఇంద్రప్రస్థ గేటెడ్ కమ్యూనిటీ కాలనీలో ఏర్పాటు చేసిన సేంద్రియ వ్యవర్థాలను ఎరువుగా మార్చే కేంద్రాన్ని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. స్థానికులు తమ దృష్టికి తీసుకొచ్చిన సమస్యలను పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించామని తెలిపారు. వన్ వార్డ్ ఎవరీ డే కార్యక్రమంలో భాగంగా నేరుగా ప్రజల మధ్యలోకి వెళ్లి సమస్యలను తెలుసుకుని వాటిని పరిష్కస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో జోనల్ కమిషనర్ నారాయణ్ అమిత్, ఉప కమిషనర్ జ్యోతిరెడ్డి, తేనా అధ్యక్షుడు రమణ తదితరులు పాల్గొన్నారు.


