బంగారం దుకాణంలో చోరీ | - | Sakshi
Sakshi News home page

బంగారం దుకాణంలో చోరీ

Aug 18 2026 7:58 AM | Updated on Aug 18 2026 7:58 AM

జహీరాబాద్‌ టౌన్‌: నలుగురు మహిళలు షాపు యజమాని దృష్టి మళ్లించి నగలను ఎత్తుకెళ్లారు. ఈ ఘటన పట్టణంలోని భవానీ మందిర్‌ రోడ్డులో ఉన్న ’న్యూ జై భవానీ జ్యువెలరీ’ షాపులో చోటు చేసుకుంది. జహీరాబాద్‌ టౌన్‌ ఎస్‌ఐ లవకుమార్‌ కథనం ప్రకారం.. ఈ నెల 16న సాయంత్రం నలుగురు గుర్తుతెలియని మహిళలు బుర్ఖాలు ధరించి షాపులోకి వచ్చారు. నగలు చూపించాలని షాపు యజమాని చెన్నూరి శివకుమార్‌ను కోరారు. అతడు నగలు చూపిస్తుండగా, మాటల్లో పెట్టి దృష్టి మళ్లించారు. ఆ సమయంలో కౌంటర్‌లో ఉన్న ముక్కుపుడకల బాక్స్‌ను గుట్టుచప్పుడు కాకుండా దొంగిలించి అక్కడ నుంచి పరారయ్యారు. బాక్స్‌లో సుమారు 7 తులాల బరువుగల బంగారు ముక్కుపుడకలు ఉన్నాయని బాధితుడు తెలిపాడు. అతడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. షాపులోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలించి, నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement