రైల్వే స్టేషన్‌ను సందర్శించిన
డీఆర్‌ఎం గోపాలకృష్ణన్
జహీరాబాద్: అమృత్ పథకం కింద రూ.24 కోట్లతో చేపట్టిన జహీరాబాద్ రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని దక్షిణమధ్య రైల్వే డీఆర్‌ఎం ఆర్.గోపాలకృష్ణన్ స్పష్టం చేశారు. జహీరాబాద్ రైల్వే స్టేషన్‌ను ఆయన గురువారం సందర్శించారు. అభివృద్ధి పనులు ఏ మేరకు జరిగాయనే విషయాన్ని ఇంజనీరింగ్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. స్టేషన్‌ను కలియదిరిగి నిర్మాణంలో ఉన్న పనులను పరిశీలించారు. ఇప్పటివరకు 65%మేర పనులు పూర్తికాగా, మిగతా పనులను త్వరితగతిన పూర్తి చేసేలా చూడాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. పనులు సాధ్యమైనంత త్వరగా పూర్తి చేస్తే ప్రయాణీకులకు సౌలభ్యంగా ఉంటుందన్నారు.
సర్కారు బడిలోనే
నాణ్యమైన విద్య
వాల్‌పోస్టర్ ఆవిష్కరణలో డీఈఓ రోహిణి
సదాశివపేట రూరల్(సంగారెడ్డి): ప్రభుత్వ పాఠశాలల్లో చేరి నాణ్యమైన విద్యను పొందాలని డీఈఓ రోహిణి సూచించారు. మండలంలోని నిజాంపూర్ కాలనీ ప్రభుత్వ పాఠశాల హెచ్‌ఎం రామకృష్ణ రూపొందించిన పాఠశాల వాల్‌పోస్టర్‌ను గురువారం ఆమె ఆవిష్కరించారు. అనంతరం రోహిణి మాట్లాడుతూ..మానవ విలువలు కలిగి ఉండే చదువును పొందే అవకాశం ప్రభుత్వ పాఠశాలల్లోనే ఉంటుందన్నారు. ప్రభుత్వ పాఠశాలలో చదివిన విద్యార్థులకు ఉచితంగా దుస్తులు, పుస్తకాలు,మధ్యాహ్న భోజనం, వీటితోపాటు బ్యాగు, టై బెల్టు,షూష్‌తో కూడిన 9 వస్తువుల కిట్‌ను కూడా అందజేస్తారని తెలిపారు. అన్ని సౌకర్యాలు కలిగిన ప్రభుత్వ పాఠశాలల్లోనే పిల్లల్ని చేర్పించి వారికి మంచి భవిష్యత్తును కల్పిద్దామని పిలుపునిచ్చారు. పాఠశాలలో విద్యాభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్న హెచ్‌ఎం రామకృష్ణను ఈ సందర్భంగా అభినందించారు.
ఎస్‌ఐఆర్‌తో కాంగ్రెస్,
బీఆర్‌ఎస్‌ల్లో వణుకు
ఎమ్మెల్సీ చిన్నమైల్ అంజిరెడ్డి
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: ఉనికిని కోల్పోతామనే భయంతోనే బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలు ఎస్‌ఐఆర్ ప్రక్రియను వ్యతిరేకిస్తున్నాయని బీజేపీ ఎమ్మెల్సీ చిన్నమైల్ అంజిరెడ్డి విమర్శించారు. బోగస్ ఓట్లకు చెక్ పెట్టేందుకు కేంద్ర ఎన్నికల సంఘం పారదర్శకంగా నిర్వహిస్తున్న ఈ ప్రక్రియతో ఈ రెండు పార్టీల వెన్నులో వణుకు పుడుతోందన్నారు. గురు వారం సంగారెడ్డిలోని జిల్లా పార్టీ కార్యాలయంలో ముఖ్యనేతల సమావేశం జరిగింది. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పారదర్శకంగా చేస్తున్న ఈ ఎస్‌ఐఆర్ ప్రక్రియతో రాష్ట్రంలో సుమారు 88 లక్షల బోగస్ ఓట్లకు చెక్ పడే అవకాశాలున్నాయన్నారు. బోగస్ ఓట్లను నమ్ముకుని అక్రమ మార్గాల్లో రాజకీయం చేయలేమనే భ యంతోనే ఈ రెండు పార్టీలు ఆందోళనకు గు రవుతున్నాయన్నారు. బీజేపీ కార్యకర్తలు, శ్రేణులు కష్టపడి పనిచేస్తే రాష్ట్రంలో కూడా అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు.
కార్మికుల సమస్యల
పరిష్కారానికి కృషి
సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు రాములు
రామచంద్రాపురం(పటాన్‌చెరు): కార్మికుల సమ స్యలను పరిష్కరించడంలో సీఐటీయూ ముందుందని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు, పెన్నార్ పరిశ్రమ యూనియన్ అధ్యక్షుడు చుక్క రాము లు పేర్కొన్నారు. రామచంద్రాపురం మండల పరిధిలోని బండలగూడ పెన్నార్ పరిశ్రమ కార్మిక సంఘం ఎన్నికల సందర్భంగా గురువారం సీఐటీయూ ఆధ్వర్యంలో గేట్ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ ఈ ఎన్నికల్లో సీఐటీయూను గెలిపించాలన్నారు. తమకు ఐఎన్‌టీయూసీ సైతం మద్ద తు ఇస్తుందని తెలిపారు. అనంతరం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి కాట శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ.. కార్మికుల హక్కుల సాధన కోసం సీఐటీయూ కృషి చేస్తుందని తెలిపారు.


