ఏసీబీకి చిక్కిన విద్యుత్‌ శాఖ ఏఈ | - | Sakshi
Sakshi News home page

ఏసీబీకి చిక్కిన విద్యుత్‌ శాఖ ఏఈ

Jun 19 2026 7:51 AM | Updated on Jun 19 2026 7:51 AM

జిన్నారం (పటాన్‌చెరు): బొల్లారం డివిజన్‌లో బాధితుడి నుంచి ఓ విద్యుత్‌ శాఖ ఏఈ లంచం తీసుకుంటుండగా గురువారం ఏసీబీ రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకుంది. మెదక్‌ ఏసీబీ డీఎస్పీ సుదర్శన్‌ తెలిపిన వివరాల ప్రకారం.. బొల్లారం విద్యుత్‌ శాఖ కార్యాలయంలో ఏఈగా రామకృష్ణారెడ్డి విధులు నిర్వహిస్తున్నాడు. ఇటీవల స్థానిక వైఎస్సార్‌ కాలనీలోని విద్యుత్‌ స్తంభాన్ని వాహనం ఢీకొట్టింది. అయితే ఈ ప్రమాదంలో విద్యుత్‌ పోల్‌ ధ్వంసమైన ఘటనలో ఓ వ్యక్తి నుంచి రూ.50 వేలు డిమాండ్‌ చేయగా.. రూ.25 వేలకు ఒప్పందం కుదిరింది. ఈ మేరకు గురువారం ఏసీబీ అధికారుల బృందం ఏఈ రోడ్డు పక్కన తన కారులో లంచం తీసుకుంటుండగా.. రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఎవరైనా అధికారులు వేధించిన ఏసీబీకి ఫిర్యాదు చేయాలని, ఫిర్యాదు చేసిన వ్యక్తుల వివరాలు గోప్యంగా ఉంచనున్నట్లు తెలిపారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement