రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి | - | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

Jun 19 2026 7:51 AM | Updated on Jun 19 2026 7:51 AM

చేగుంట(తూప్రాన్‌): రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన మాసాయిపేట మండలం రామంతాపూర్‌ చౌరస్తా జాతీయ రహదారిపై గురువారం చోటు చేసుకుంది. ఎస్‌ఐ చైతన్యకుమార్‌రెడ్డి కథనం ప్రకారం చిన్నశంకరంపేట మండలం చందంపేట గ్రామానికి చెందిన శేకు ఎల్లం(35), రామంతాపూర్‌ గ్రామానికి చెందిన రెడ్డబోయిన ఆంజనేయులు చేగుంట నుంచి బైకుపై తూప్రాన్‌ వైపునకు వెళ్తున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్‌ నుంచి నిజామాబాద్‌కు వెళ్తున్న లారీ బైకును రామంతాపూర్‌ చౌరస్తా వద్ద ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఎల్లం కడుపుపై నుంచి లారీ వెళ్లింది. స్థానికులు అంబులెన్స్‌లో ఇద్దరిని తూప్రాన్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అప్పటికే ఎల్లం మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement