● 19 బ్రాంచ్‌ల్లో 580 సీట్లు
● 30వ తేదీ తుది గడువు
● ఐటీఐలను ఏటీసీలు మార్చిన ప్రభుత్వం
సంగారెడ్డి క్రైమ్: పారిశ్రామిక శిక్షణ సంస్థ (ఐటీఐ)ల్లో విద్యార్థులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఏటీసీ (అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్)లలో అడ్మిష్లన్లు జోరుగా సాగుతున్నాయి. ఆధునిక పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా విద్యార్థులకు సాంకేతిక నైపుణ్యాలను అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం వీటిని రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటుచేసిన సంగతి తెలిసిందే. పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు ఏటీసీల్లో ఆన్‌లైన్ దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందుకు ఈనెల 30 వరకు తుది గడువును విధించింది.
పరిశ్రమల్లో ఉపాధి అవకాశాలు
ఏటీసీల్లో అత్యాధునిక యంత్రాలు విద్యార్థులకు అందుబాటులో ఉన్నాయి. బోధన, శిక్షణకు అవసరమైన పరికరాలను టాటా కంపెనీ సహకారంతో ప్రభుత్వం ఏర్పాటు చేసింది. శిక్షకులను కూడా నియమించారు. ఇక సంగారెడ్డి ఏటీసీలో 19 బ్రాంచ్‌ల్లో మొత్తం 580 సీట్లు విద్యార్థులకు కేటాయించారు.
ప్రస్తుతం అందుబాటులో ఉన్న కోర్సులు..
సీఎసీ మెకానిక్ టెక్నీషియన్, ఇంజనీర్స్ టెస్టింగ్ టెక్నీషియన్, మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ కంట్రోల్ అండ్ ఆటోమేటివ్ టెక్నీషియన్, మెకానిక్ ఎలక్ట్రిక్ వెహికల్, ఎనాలసిస్ వర్చువల్ అండ్ డిజైనర్, ఇండస్ట్రియల్ రోబోటిక్స్ అండ్ డిజిటల్ మ్యానుఫ్యాక్చరింగ్ టెక్నీషియన్.
దరఖాస్తుకు జతచేయాల్సిన ధ్రువపత్రాలు
● పదో తరగతి మార్కుల జాబితా
● కుల, ఆదాయ నివాస ధ్రువీకరణ పత్రం
● ఆధార్ కార్డ్
● నాలుగు నుంచి పదో తరగతి వరకు స్టడీ అండ్ కాండక్ట్‌సర్టిఫికెట్స్
● విద్యార్థి పాస్‌పోర్ట్ సైజ్ ఫొటో
● మొబైల్ నంబర్


