మల్లన్న ఆలయంలో వేలం పాటలు | - | Sakshi
Sakshi News home page

మల్లన్న ఆలయంలో వేలం పాటలు

Jun 19 2026 7:51 AM | Updated on Jun 19 2026 7:51 AM

కొమురవెల్లి(సిద్దిపేట): కొమురవెల్లి మల్లికార్జునస్వామి ఆలయంలో ఆలయ ఈఓ సుధాకర్‌రెడ్డి ఆధ్వర్యంలో గురువారం పలు వేలం పాటలు నిర్వహించారు. ఆలయ పరిసరాలలో కొబ్బరికాయలను విక్రంచుకునే హక్కును రూ.48.50 లక్షలకు కొమురవెల్లికి చెందిన తిరుపతి, కొబ్బరి ముక్కలను పోగుచేసేకునే హక్కును రూ.75,00,116లకు పోతిరెడ్డిపల్లికి చెందిన మహేందర్‌, ఒడిబియ్యం, వస్త్రాలు, పసుపును పోగుచేసుకునే హక్కును రూ.73.50 లక్షలకు ఉప్పల వంశీకృష్ణ, ఎల్లమ్మ ఆలయం వద్ద వస్త్రాలు, ఒడిబియ్యం, పసుపు సేకరించే హక్కును రూ.23.30 లక్షలకు ఎస్‌.వెంకటేశ్‌, కోరమీసాలు విక్రయించుకునే హక్కును రూ.17.31 లక్షలకు ఎక్కాలదేవి అరుణ దక్కించుకున్నారు. అలాగే బ్యాగులు, పాదరక్షలు భద్రపర్చుకునే హక్కును రూ.18,00,116లకు నెహూర, మూడు టాయిలెట్‌ బ్లాక్‌ల నిర్వహణ హక్కును రూ.5.25 లక్షలకు హైదరాబాద్‌కు చెందిన మిశ్రా ఎంటర్‌ప్రైజెస్‌ దక్కించుకున్నాయి. ఈ టెండర్ల ద్వారా ఆలయానికి మొత్తం 2 కోట్ల, 64 లక్షల 32 రూపాయలు సమకూరినట్లు ఆలయ అధికారులు తెలిపారు. కార్యక్రమంలో ఆలయ ఏఈఓ శ్రీనివాస్‌, ప్రధాన అర్చకుడు మహదేవుని మల్లికార్జున్‌, పర్యవేక్షకులు చంద్రశేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement